తమిళ, తెలుగు,హిందీ,మలయాళ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తూ సక్సెస్ అయిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నటించిన మహానటి మూవీతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ టాక్ షో లో నేను చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చాను అంటూ ఓ సంచలన నిజాన్ని బయటపెట్టింది.మరి ఇంతకీ జైలు వరకు వెళ్లాల్సిన పరిస్థితి కీర్తి సురేష్ కి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో కి ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు వచ్చి షోని సక్సెస్ చేస్తున్నారు. అలా నాగార్జున, మీనా, నాగచైతన్య, తేజ సజ్జా, సిమ్రాన్, శ్రీ లీల, నాని,ఆర్జీవి,సందీప్ రెడ్డి వంగా, ప్రభుదేవా, మహేశ్వరి ఇలా ఎంతోమంది గెస్ట్ లు వచ్చారు.

 ఇక తాజాగా రాబోయే ఎపిసోడ్లో కీర్తి సురేష్ రాబోతుంది. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రిలీజ్ చేయగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తుంది. అయితే ఈ ప్రోమోలో జగపతిబాబు నీకు భాషా లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందట నిజమేనా.. జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అడగగా..నా గురించి ముందే మీకు అన్ని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.ఒక్కసారి కాదు జైలుకు చాలా సార్లు వెళ్లి వచ్చాను అంటూ కీర్తి సురేష్ ఆన్సర్ ఇచ్చింది.అయితే కీర్తి ఆన్సర్ తో చాలా మంది షాక్ లో మునిగిపోయారు.

ఇదేంటి ఇంత పెద్ద హీరోయిన్ అయినటువంటి కీర్తి సురేష్ అన్ని సార్లు జైలుకు ఎందుకు వెళ్లి వచ్చింది అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. మరి కీర్తి సురేష్ జైలుకు ఎందుకు వెళ్ళింది.. దాని వెనుక ఉన్న నిజాలు ఏంటి.. కీర్తి సురేష్ భాషా టైప్ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది అనే నిజాలు తెలియాలంటే కచ్చితంగా కీర్తి సురేష్ వచ్చిన పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన్ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: