టాలీవుడ్ లో నటుడుగా పేరు సంపాదించిన నటుడు శ్రీకాంత్ భరత్ తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. కానీ నిరంతరం సోషల్ మీడియాలో అటు రాజకీయాల పరంగా, ఏదో ఒక వివాదంలో ఈ నటుడి పేరు వినిపిస్తుంది. ఇటీవల అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మహాత్మా గాంధీ పైన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా వైరల్ గా మారారు. ఈ విషయం పై చాలామంది ఈ నటుడి పై ఫైర్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ తాను అన్న వ్యాఖ్యలు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోని కూడా షేర్ చేశారు


మహాత్మా గాంధీని ఆగౌరవ పరిచే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడిన మాటలపై అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇప్పుడు పెరిగిపోయింది. ఈ విషయంపై యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్ సభ్యులు, అలాగే సేవాలాల్ బంజారా సంఘం వంటి వారు నటుడు శ్రీకాంత్ భరత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీని వ్యక్తిగతంగా దూషించారని, అలాగే కొన్ని నిరాధార ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదులో తెలియజేశారు.

   

దేశం గర్వించే మహాత్మా గాంధీ పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ పైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలంటు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు కంప్లైంట్  తీసుకొని మరి దర్యాప్తు చేస్తామని  వెల్లడించారు.  దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల పైన ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారు సమాజాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా తెలియజేశారు. మరి ఈ కేసు పైన నటుడు శ్రీకాంత్ భరత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: