
అప్పట్లో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి టీడీపీకి కొత్త దిశను చూపించారు. 1999లో తిరిగి గెలుపొందగా, 2004లో ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. అనంతరం 2014లో రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబుకు మరోసారి సీఎం కుర్చీ దక్కింది. 2019లో విరామం వచ్చినా, 2024లో తిరిగి ఘన విజయం సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగు నేతల చరిత్రలో చంద్రబాబు ముందు ఎవరూ 15 ఏళ్లు సీఎంగా పనిచేయలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి 7 సంవత్సరాల 21 రోజులు, ఎన్టీఆర్ మూడు విడతల్లో కలిపి 7 సంవత్సరాల 194 రోజులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5 సంవత్సరాల 111 రోజులు, నీలం సంజీవ రెడ్డి 5 సంవత్సరాల 51 రోజులు సీఎంగా కొనసాగారు.
ఈ లెక్కల్లో చంద్రబాబు సీఎంగాయఅగ్రస్థానంలో నిలిచారు. ప్రమాదాల నడుమ చంద్రబాబు రాజకీయ ప్రస్థానం సాగినా, ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసం వృద్ధి చెందుతోంది. రాష్ట్రానికి సంక్షోభం వచ్చినపుడు చంద్రబాబే ముందు వరుసలో ఉంటారని ప్రజలు నమ్ముతారు. అందుకే 2014, 2024లో ఆయనకు తిరిగి పట్టం కట్టారు. ఇది ఆయన్ను మరింత ప్రభావవంతమైన నాయకుడిగా నిలిపింది. ఇక ముందు ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉందని తీసుకుంటే చంద్రబాబు మొత్తం 19 ఏళ్లు సీఎంగా పనిచేసే అవకాశం ఉంది. ఇది భారత రాజకీయాల్లో అరుదైన ఘనత. ముఖ్యంగా దక్షిణాదిలో ఇంతకాలం పదవిలో ఉన్న నేతలు కేవలం కరుణానిధి (తమిళనాడు), రంగస్వామి (పుదుచ్చేరి) మాత్రమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి ఈ ఘనత దక్కడం తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలుస్తుంది.