తమిళ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే చాలా సినిమాల్లో హీరో గా నటించాడు. అలాగే పలు మూవీ లకు దర్శకత్వం కూడా వహించాడు. ఈయన హీరో గా నటించిన సినిమాలలో చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అలాగే ఈయన దర్శకత్వం వహించిన సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. దానితో ఈయన నటుడి గా , దర్శకుడి గా రెండింటిలో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ప్రదీప్ "డ్రాగన్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈయన డ్యూడ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ కి బుక్ మై షో లో ఆఖరి 24 గంటల్లో అదిరి పోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి దక్కించుకుంది. ఆఖరి 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించిన 235.55 కే టికెట్లు సేల్ అయ్యాయి. ఈ రేంజ్ లో ఈ మూవీ కి సంబంధించిన టికెట్లు కేవలం 24 గంటల్లో సేల్ అయ్యాయి అంటేనే అర్థం అవుతుంది ఈ మూవీ పై ప్రేక్షకులు ఏ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది.

ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ప్రదీప్ రంగనాథన్ "డ్యూడ్" మూవీ తో కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ప్రదీప్ రంగనాథన్ "డ్యూడ్" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: