
ఇలాంటి సమయంలోనే ఈ సినిమా అప్డేట్ కోసం మేకర్స్ రెండు మూడు మంచి తేదీలను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ ,రాజమౌళి చిత్రానికి సంబంధించి హైదరాబాదులో ఒక ఈవెంట్ ను కూడా ప్లాన్ చేసినట్లు వినిపిస్తున్నాయి. నవంబర్ 11 లేదా 15వ తేదీలలో ఈ వేడుక జరిగే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈవెంట్ పబ్లిక్ ఈవెంటా లేకపోతే ఏంటా అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ సినిమా వేదిక కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది చిత్ర బృందం. ఈవెంట్లో టైటిల్ ను కూడా రివీల్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకు సంబంధించి గ్లింప్స్ కూడా చిత్ర బృందం రిలీజ్ చేసే అవకాశమున్నట్లు వినిపిస్తున్నాయి. అయితే SSMB 29 చిత్రానికి వారణాసి అనే టైటిల్ పరిశీలనలో ఉంచినట్లుగా వినిపిస్తున్నాయి. ఈవెంట్లో అటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి కూడా రాబోతున్నారు. ఈ సినిమా గురించి అప్డేట్ రాబోతోందని తెలిసి అభిమానులకు కూడా ఆనందపడుతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో కచ్చితంగా ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కనిపించారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించకుంది.