ఆ సినిమా మరేదో కాదు — మారుతి దర్శకత్వంలో రూపొందిన “రాజా సాబ్”! ఇది ఒక ఫుల్ ఎంటర్‌టైనింగ్ హారర్ కామెడీ మూవీగా తెరకెక్కుతోంది. ప్రభాస్ మొదటిసారి ఇలా లైట్ హారర్ కామెడీ టచ్ కలిగిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. మొదట్లో “రాజా సాబ్”ని ఒకే పార్ట్‌గా ముగించాలని డైరెక్టర్ మారుతి అనుకున్నారట. కానీ షూటింగ్ మధ్యలో ప్రభాస్ స్వయంగా కథలోని ట్విస్ట్‌లను విని, “ఈ పాయింట్‌ని మరింతగా ఎక్స్‌టెండ్ చేస్తే, మరో పార్ట్‌కి స్ట్రాంగ్ లీడ్ ఉంటుంది” అని సజెషన్ ఇచ్చాడట. దాంతో మారుతి కూడా ఆ ఐడియాపై ఇంప్రెస్ అయి, సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం “రాజా సాబ్ 2”కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నిశ్శబ్దంగా కొనసాగుతోందట. . అన్నీ సరిగ్గా కుదిరితే, “రాజా సాబ్” మొదటి భాగం థియేటర్లలో రిలీజ్ అయిన రోజే, “రాజా సాబ్ 2”ని అధికారికంగా అనౌన్స్ చేయాలనే ప్లాన్‌లో టీమ్ ఉందట. అంతే కాదు, ఈ ప్రాజెక్ట్‌కి అభిమానుల నుంచి స్పందన అద్భుతంగా వస్తే, “రాజా సాబ్ 3” కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అంటే ఒక్క సినిమా కాదు, రెండు కాదు, మూడు పార్ట్‌లతో ప్రభాస్ మరో కొత్త ఫ్రాంచైజీని సెట్ చేయబోతున్నాడు.
ఒకవైపు “కల్కి ” వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, మరోవైపు లైట్ హారర్ ఎంటర్‌టైన్మెంట్‌తో కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే ప్రయత్నం ప్రభాస్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇప్పటికే “#RajaSaab2” హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అభిమానులు “డార్లింగ్ బ్యాక్ విత్ హారర్ ఫన్!” అంటూ ఉత్సాహంగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక మారుతి – ప్రభాస్ కాంబినేషన్ అంటేనే గ్యారెంటీ ఎంటర్‌టైన్‌మెంట్. ఈసారి సీక్వెల్‌లతో సూపర్ ఫన్, సూపర్ హారర్, సూపర్ హిట్ కాంబినేషన్‌గా “రాజా సాబ్” సిరీస్ నిలిచేలా ఉంది. చివరగా చెప్పాలంటే — ప్రభాస్ అభిమానులకు ఇది కేవలం డబుల్ కాదు... ట్రిపుల్ ఫెస్టివల్!“రాజా సాబ్ 1”, “రాజా సాబ్ 2”, “రాజా సాబ్ 3” అంటూ డార్లింగ్ మరో కొత్త లెగసీని సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.ఈసారీ ప్రభాస్ నుంచి మాస్, క్లాస్, హారర్... అన్నీ కలిసిన అల్టిమేట్ ఎంటర్‌టైన్మెంట్ ధమాకా!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి