ఇటీవల కాలంలో సినిమా రంగంలో ఒక డిబేట్ బాగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. అదేంటంటే — హీరోలకు ఒక రూల్, హీరోయిన్స్‌కి మరో రూల్! సినిమా సెట్లో పని గంటలు, రెస్ట్ డేస్, షెడ్యూల్స్‌ విషయంలో తేడా చూపిస్తున్నారని, చాలా మంది మహిళా నటీమణులు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలు సాధారణంగా ఎనిమిది గంటలకే షూట్ ముగించేసి, వీకెండ్‌ల్లో రెస్ట్ తీసుకుంటారని అంటున్నారు. కానీ హీరోయిన్స్ మాత్రం ఎలాంటి విరామం లేకుండా, ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్ చేయాల్సి వస్తోందని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సెన్సిటివ్ సిట్యూవేషన్‌లోనే ఒక ప్రముఖ నిర్మాత తన మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు — ఎస్.కే.ఎన్ . ఎన్నో  సక్సెస్‌ఫుల్ సినిమాల నిర్మాతగా గుర్తింపు పొందిన ఈయన, తాజాగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయాయి.


ఎస్.కే.ఎన్ మాట్లాడుతూ —“నా దృష్టిలో రష్మిక మందన్న అనే అమ్మాయి మాత్రమే టైం కన్నా ఎక్కువ వర్క్ చేస్తుంది ఆమెకు టైమ్ అనే పదమే తెలియదు. ప్రేమతో, ప్యాషన్‌తో పని చేస్తుంది. నేను ఇప్పటివరకు చూశిన హీరోయిన్‌లలో ఇంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ ఇంకొకరు లేరు. టైం అయిపోయినా కూడా ఇంకా ఎక్కువుగా వర్క్ చేసే హీరోయిన్ ఆమె” అని ఆయన అన్నారు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆయన మరింతగా రష్మికను ఆకాశానికి ఎత్తేశారు —“కొంతమందిలో స్వీట్‌నెస్ ఉంటుంది, కొంతమందిలో కూల్‌నెస్ ఉంటుంది, మరికొందరిలో హాట్‌నెస్ ఉంటుంది. కానీ ఆ మూడింటినీ కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూపించగలిగిన హీరోయిన్ రష్మిక మాత్రమే! . అనిమల్, పుష్ప 2 లాంటి ప్రాజెక్ట్స్‌తో ఆమె కెరీర్ పీక్‌లో ఉంది. కానీ అటు ఫేమ్, ఇటు రూమర్స్ — ఇవన్నీ పక్కన పెట్టి ఎంత సింపుల్‌గా, హార్డ్‌వర్క్‌తో వ్యవహరిస్తుందో చూడండి. నిజంగా పాన్ ఇండియా స్థాయిలో అలా పని చేసే ఒక్కే ఒక్క బ్యూటీ ఈమె.  ఓపికతో, స్మైల్‌తో ప్రతి సీన్‌కి ప్రాణం పోస్తుంది. రష్మిక లాంటి ఆర్టిస్ట్‌ని నేను ఇప్పటివరకు చూడలేదు” అని తెలిపారు.



ఇంతకీ ఈ కామెంట్స్ వెనుక “దీపికను ఉద్దేశించి పరోక్షంగా అన్నారా?” అని సోషల్ మీడియాలో నెటిజన్లు డిస్కషన్ మొదలుపెట్టారు. “రష్మిక అంటే క్యూట్‌నెస్, టాలెంట్, డెడికేషన్ అన్నీ కలిసిన కాంబినేషన్. ఆమె పనిని గంటలతో కొలవలేం. ప్రేమతో, ప్యాషన్‌తో కొలవాలి. ప్రేమకి టైమ్ ఉండదు — రష్మికకి కూడా టైమింగ్ ఒక్కటే తెలుసు — ‘పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్!’” అని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు “ఇలా నిర్మాతలే ఒక హీరోయిన్ కష్టాన్ని పబ్లిక్‌గా ప్రశంసించడం చాలా గర్వకారణం” అంటుంటే, ఇంకొందరు “దీనికి పరోక్షంగా మరెవరినైనా టార్గెట్ చేశారా?” అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, రష్మిక పేరు మరోసారి టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో చేరిపోయింది. పాన్ ఇండియా రేంజ్‌లో తన కష్టపడి పనిచేసే స్వభావంతో, ఎన్ని గంటలైనా బ్రేక్ లేకుండా పనిచేసే ఆ “వన్ అండ్ ఓన్లీ హీరోయిన్”గా రష్మిక మందన్న మరోసారి నిరూపించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: