సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారు మరియు అలాగే అనేక మంది కూడా ఒక సినిమాను ఎంత బాగా తీశామో అనే దాని కంటే కూడా ఒక మూవీ ని ఎంత బాగా ప్రమోట్ చేసాము అనేది ఈ రోజుల్లో అత్యంత ముఖ్యం అనే వాదనను వినిపిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ఒక సినిమాను ఎంత బాగా తీసిన కూడా ఆ సినిమాను అద్భుతమైన రీతిలో ప్రమోట్ చేయనట్లయితే సినిమా విడుదల అయ్యాక ఆ మూవీ కి ఎవరూ వెళ్లకపోవడంతో మూవీ బాగున్న కూడా పెద్దగా కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉండదు. అదే సినిమాను అద్భుతంగా తీసి దాని ప్రమోషన్లను కూడా అదే రేంజ్ లో చేసినట్లయితే మూవీ విడుదల అయ్యాక సినిమాకు జనాలు రావడం , ఆ తర్వాత మంచి టాక్ వస్తే ఆ మూవీ కలెక్షన్లు పెరగడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది సినిమా తీయడం కోసం ఏ రేంజ్ లో ప్లాన్స్ ను వేస్తున్నారో సినిమా పూర్తి అయ్యాక ప్రమోషన్లకు కూడా అదే రేంజ్ ప్లాన్స్ వేస్తున్నారు.

ఇకపోతే కొంత మంది సినిమా షూటింగ్ పూర్తి కాగానే ప్రమోషన్ల పైనే ఎంతో సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నారు. ఇక ఈ రూట్లోకే రామ్ పోతినేని , భాగ్య శ్రీ బోర్స్ కూడా చేరినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఉపేంద్ర ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. నవంబర్ 28 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉండగానే రామ్ మరియు భాగ్య శ్రీసినిమా ప్రమోషన్లను మొదలు పెట్టేశారు. ప్రస్తుతం వీరు వరుస పెట్టి ఇంటర్వ్యూలను ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం రామ్ , భాగ్య శ్రీ ఇప్పటి నుండే ప్రమోషన్లను పెద్ద ఎత్తున మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: