చాలా సంవత్సరాల క్రితం అనేక మంది దర్శకుడు సంవత్సరానికి నాలుగు , ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే వారు. కాలం మారుతున్న కొద్దీ దర్శకులు సంవత్సరానికి తీసే సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం మాత్రం కొంత మంది స్టార్ డైరెక్టర్లు కనీసం సంవత్సరానికి ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నారు. కొంత మంది దర్శకులు ఏకంగా ఒక్క సినిమాకు రెండు , మూడు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటున్నారు. అత్యంత తక్కువ మంది దర్శకులు మాత్రమే సంవత్సరానికి ఒకటి , రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేసే దర్శకులు సంవత్సరానికి ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అత్యంత కష్టంగా మారింది. కానీ స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ అనిల్ రావిపూడి మాత్రం అదిరిపోయే రేంజ్ స్పీడ్ లో ప్రేక్షకుల ముందుకు సినిమాలను తీసుకువస్తున్నాడు. అలాగే ప్రతి సినిమాతో కూడా హిట్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి , చిరంజీవి హీరోగా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మూవీ లో నయన తార హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని కొంత కాలం క్రితమే అనిల్ రావిపూడి స్టార్ట్ చేశాడు. ఇక అప్పుడే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరినట్లు తెలుస్తోంది.

ఈ నెల చివరి వరకు ఈ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ కానున్నట్లు , డిసెంబర్ నుండి ఈ మూవీ ప్రమోషన్లను మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇలా అనిల్ రావిపూడి అత్యంత వేగంగా సినిమాలను పూర్తి చేస్తూ రావడం , వాటితో హిట్లను అందుకోవడంతో చాలా మంది ప్రజలు అనిల్ రావిపూడి ని చూసి ఎంతో మంది టాలీవుడ్ డైరెక్టర్లు నేర్చుకోవాలి. ఆయన చాలా త్వరగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. వాటితో హిట్లను కూడా అందుకుంటున్నాడు. అలాగే స్పీడ్ గా సినిమాను పూర్తి చేయడం వల్ల నిర్మాతకు కూడా ఎంతో డబ్బులు ఆదా అవుతున్నాయి ఆయనలా అనేక మంది దర్శకులు ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందుతుంది అని కొంత మంది తమ వాదనను వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: