టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటున్నాడు. బాలయ్య కొంత కాలం క్రితం డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. బాలయ్య కొంత కాలం అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో బాలయ్య రెండు పాత్రలలో నటించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి తాండవం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాండవం సాంగ్ కి విడుదల 24 గంటల్లో 3.72 మిలియన్ వ్యూస్ ... 76 వేల లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే అఖండ 2 మూవీ లోని తాండవం సాంగ్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ 24 గంటల్లో లభించకపోయిన మంచి రెస్పాన్స్ మాత్రం లభించింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో బాలయ్య ఏ రేంజ్ బిర్యాని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: