ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కొంత కాలం క్రితం నవంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు.

సినిమా యొక్క విడుదల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత ఈ మూవీ బృందం వారు ఈ మూవీ ప్రమోషన్లను కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ చాలా సాంగ్స్ ను , కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను అందుకొని డీలా పడిపోయిన రామ్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని అదిరిపోయే రేంజ్ కం బ్యాక్ ఇస్తాడు అని రామ్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. 

సినిమా విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారికి ఈ మూవీ బృందం అద్భుతమైన సంతోషాన్ని నింపే న్యూస్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని నవంబర్ 28 వ తేదీన కాకుండా అంతకు ఒక రోజు ముందు అనగా నవంబర్ 27 వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారికి ఇది అద్భుతమైన న్యూస్ అని చెప్పవచ్చు. మరి వరుస అపజయాలతో ఉన్న రామ్ ఈ సినిమాతో ఏ స్థాయి సక్సెస్ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: