నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ "అఖండ" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ లో హీరో గా నటించిన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అఖండ మూవీ మంచి విజయం సాధించిన తర్వాత ఆ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 మూవీ ని రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక కొంత కాలం క్రితమే అఖండ 2 మూవీ యొక్క షూటింగ్ను ప్రారంభించారు. డిసెంబర్ 5 వ తేదీన ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రచారాలను కూడా మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఆఫ్రికా థియేటర్ హక్కులను అమ్మి వేశారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. 

మూవీ యొక్క ఆఫ్రికా థియేటర్ హక్కులను శ్రేయస్ మీడియా , గుడ్ సినిమా సంస్థల వారు దక్కించుకున్నారు. ఇక శ్రేయస్ మీడియా , గుడ్ సినిమా సంస్థల వారు ఈ సినిమాను ఆఫ్రికా లో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: