తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ చిత్రాలతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక కామెడీ చిత్రాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ చాలా కామెడీ చిత్రాలలో నటించిన ఆయనకు ఆ జోనర్ చిత్రాల ద్వారా మంచి విజయాలు దక్కడం లేదు. దానితో ఆయన రూటు మర్చి కాస్త డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ఈయన కొంత కాలం క్రితం నటించిన నాంది సినిమా ఈయనకు మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఈయన అనేక సీరియస్ జోనర్ సినిమాలలో నటించిన వాటి ద్వారా ఈయనకు మంచి గుర్తింపు రాలేదు. తాజాగా అల్లరి నరేష్  "12 ఏ రైల్వే కాలనీ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ బృందం పూర్తి చేసినట్లు , అలాగే ఈ మూవీ రన్ టైం ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి  యూ / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కేవలం 2 గంటల 05 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చాలా తక్కువ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ మూవీ బోరు కొట్టకుండా కాస్త గ్రిప్తంగా ఉన్నా కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుండి మేకర్స్ చాలా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: