టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీలో బాలయ్య హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో కనిపించాడు.

బాలయ్య ఈ మూవీ లో ఒక పాత్రలో రైతుగా , మరొక పాత్రలో అగోరగా నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక అద్భుతమైన విజయం అందుకున్న అఖండ మూవీ కి అఖండ 2 సినిమా కొనసాగింపుగా రూపొందుతుంది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ... సంయుక్త మీనన్మూవీ లో హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ డీల్ ఇప్పటికే క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్  సంస్థ వారు దక్కించుకున్నట్లు , అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ ని నెట్ ఫ్లిక్స్ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: