సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చాక తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక కొంత మంది కి మాత్రం కెరియర్ బిగినింగ్లోనే అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం వస్తూ ఉంటుంది. ఇకపోతే కమర్షియల్ సినిమాల్లో నటించే హీరోయిన్లు ఎక్కువగా శాతం అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని ప్లాప్స్ వచ్చినా కూడా వారికి కెరియర్లో నిలదొక్కుకోవడం కష్టం అవుతుంది. అదే తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వారికి ఒకటి , రెండు ప్లాప్స్ వచ్చిన పెద్దగా ప్రాబ్లం కాదు.

మళ్ళీ వారు తమ నటనతో అద్భుతమైన అవకాశాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి అవకాశం వచ్చినా కూడా ఓ బ్యూటీ అలాంటి పాత్రల్లో నటించను అని చెప్పేస్తోంది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మీనాక్షి చౌదరి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మలలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకుంది. ఈమె ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం ఈమె లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో ఈమె ఒక బిడ్డకు తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులోని మీనాక్షి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఇకపోతే మీనాక్షి తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... లక్కీ భాస్కర్ కథ నాకు బాగా నచ్చింది. కానీ మరో సారి అలా తల్లి పాత్రలో అవకాశం వస్తే నేను సినిమా చేయను అని చెప్పింది. దానితో అనేక మంది ఆ మూవీ లో ఈమె నటన అద్భుతం. అలాంటి పాత్రలలో నటిస్తేనే ఆమె కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. అలా చేయకుండా కేవలం కమర్షియల్ సినిమాలలో నటించినట్లయితే వాటి ద్వారా కొన్ని ప్లాప్స్ వచ్చినా కూడా ఈమె కెరియర్ చాలా డేంజర్ లో పడిపోతుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc