టాలీవుడ్ లో అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన ‘అంకుశం’సినిమా గుర్తుంది కదా..ఈ సినిమాతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా డాక్టర్ రాజశేఖర్ ఒక ట్రెండ్ సృష్టించారు. అప్పటి వరకు ప్రతినాయకుడిగా కనిపించిన రాజశేఖర్ ‘అంకుశం’సినిమాతో యాంగ్రీ యంగ్ మాన్ గా కొత్త అవతారం ఎత్తారు. ఆ తర్వాత పోలీస్ పాత్రల్లో కనిపించినా..రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ సినిమాతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
కొంత కాలం తర్వాత ఫ్యామీలీ తరహా సినిమాల్లో నటించిన రాజశేఖర్ వరుస ఫ్లాపులతో సతమతమయ్యారు. దాంత కొంత కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు. రాజశేఖర్ తన సహనటి జీవితను వివాహం చేసుకున్నారు..వీరికి శివానీ, శివాత్మిక కూతుళ్లు. ‘గరుడవేగ’సినిమాత రాజశేఖర్ రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం వీరి కూతుళ్లు శివానీ, శివాత్మికలు వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. శివానీ.. 2 స్టేట్స్ తెలుగు రీమేక్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో అడవిశేషు హీరో..ఇక ఇక శివాత్మిక దొరసాని చిత్రంతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచనుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ హీరోగా నటిస్తున్నాడు. వెండి తెరపై ఈ ఇద్దరూ వినోదం పంచడానికి వస్తున్నారు. మరోవైపు రాజశేఖర్ ‘కల్కి’సినిమాతో అలరించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ సినిమా 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ మూవీ కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా తన కూతుళ్లు వెండి తెరపై ఆరంగేట్రం చేస్తున్న సందర్భంగా ట్విట్టర్ మాథ్యమంలోకి ఆహ్వానిస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.