యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా కోసం ఆయన డైహార్ట్ ఫ్యాన్సే కాదు... దేశంలో ఉన్న సగటు సినీ అభిమాని కూడా ఎంత ఆసక్తితో వెయిట్ చేశాడో చూశాం. సినిమాలో ఓ సన్నివేశంలో డై హార్ట్ ఫ్యాన్స్ అని చెపుతాడు.. కానీ అంత వీరాభిమానులు కూడా సినిమా చూపి పెదవి విరుస్తున్నారు. సినిమాకు నెగిటివ్ టాక్ ఒక మైనస్ అయితే సాహోలో ప్రభాస్ లుక్, డైలాగ్ డెలివరీ కూడా చాలా నీరసంగా ఉంది.
బాహుబలిలో మనం ఎలాంటి ప్రభాస్‌ను చూశాం.. సాహోలో ఎలాంటి ప్రభాస్‌ను ఊహించుకున్నాం... కానీ తెరమీద నీరసం లుక్‌లో ఉన్న ప్రభాస్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు. ఆరు సంవత్సరాల పాటు ప్రభాస్ తన కెరీర్‌ను, పర్సనల్ లైఫ్‌ను త్యాగం చేసి బాహుబలి, సాహో సినిమాల కోసం పనిచేశాడు. బాహుబలి కోసం రాజమౌళి ప్రభాస్‌ను నలిపేశాడు.
ఇక బాహుబలి సూపర్ హిట్ ఇమేజ్ తీసుకువచ్చింది. ఇప్పుడు సాహో ఇటు బెస్ట్ ఫ్రెండ్స్ సినిమా. అందులోనూ కేవలం తనను నమ్మి ఏకంగా రూ. 350 కోట్లు పెట్టారు. దీంతో ప్రభాస్ చాలా టెన్షన్‌తో సాహోకు వర్క్ చేసినట్టే అతడి మొఖంలో కనపడుతోంది. ప్రభాస్ ఫేస్‌లో ఇది వరకు చార్మింగ్ లేదు. డైలాగ్ చెప్పేటప్పుడు బాహుబలి సినిమా నాటి గ్రేస్ కూడా మిస్ అయ్యింది.
క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో మెప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించినా లుక్ ఆకట్టుకోలేదు. అసలు బాహుబలి సినిమా తర్వాత సాహోలో ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉండాలి.. థియేటర్లు దద్దరిల్లాలి. ‘సాహో’లో ప్రభాస్ ఎంట్రీ చూస్తేనే సినిమాపై కాస్త అంచనాలు తగ్గించుకుని చూస్తే మంచిదనే సంకేతాలు ఇస్తుంది. ప్రభాస్ కు సరైన ఇంట్రో కూడా ఇవ్వలేకపోవడం సుజీత్ ఘోర వైఫల్యమే.