దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. కరోనా వైరస్ సోకకపోయినా సోకిందనే భయమే చాలా మంది ప్రాణాలు తీస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపించినా చాలామంది కరోనా సోకిందని భయాందోళనకు గురవుతున్నారు. ఆ భయాందోళన చివరకు ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. తాజాగా విశాఖలో ఒక వ్యక్తి వైరస్ భయం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు.
 
కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటికే కరోనా పరీక్ష చేయించుకున్న ఆ యువకుడికి ఫలితాల్లో మాత్రం నెగిటివ్ రావడం గమనార్హం. దీంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖపట్నం చినగదిలి బీసీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం ఆకిన వసంతకుమార్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులందరూ అనారోగ్యం పాలయ్యారు.
 
ఇంట్లో అందరికీ జ్వరం రావడంతో కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 18వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ముగ్గురి రిపోర్ట్ రాగా అతని రెండో కుమారుడు హరికృష్ణకు సంబంధించి రిపోర్ట్ మాత్రం రాలేదు. దీంతో హరికృష్ణ తనకు కరోనా సోకిందేమోననే అనుమానంతో భయాందోళనకు గురయ్యాడు.
 
ఇంట్లో అందరూ పడుతున్న తరువాత తలుపుకు గడియ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వసంత్ ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజు అతనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. భయంతోనే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం వల్ల వసంత్ లా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైద్యులు కరోనా సోకినా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఇతర వ్యాధుల్లాగే కరోనా కూడా ఒక వ్యాధి మాత్రమేనని... కరోనా విజృంభించిన తొలినాళ్లకు, ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: