దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ కు సంబంధించి శాస్త్రవేత్తల పరిశోధనలు, సర్వేలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనల్లో, సర్వేల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీరం సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సర్వేలో 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.
 
ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఢిల్లీలో సీరం సంస్థ సర్వే నిర్వహించి ఈ విషయాలను వెల్లడించింది. ఈ సర్వేలో దాదాపు 15,000 మంది పాల్గొన్నారని సమాచారం. సీరం సంస్థ అధికారులు ఢిల్లీ జనాభాలో 29.1 శాతం మందిలో కరోనా వైరస్ తో పోరాడే యాంటీబాడీల అభివృద్ధి జరిగిందని తెలుస్తోంది. యాంటీబాడీలు అభివృద్ధి చెందిన వారిలో 25 శాతం మంది 18 సంవత్సరాల లోపు పిల్లలు కాగా 50 శాతం మంది 18 నుంచి 50 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం.
 
మిగిలిన వారు 50 సంవత్సరాలకు పై బడిన వారు. ఈ సర్వేలో 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు 34.7 శాతం మంది వైరస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ సర్వేలో 50 సంవత్సరాలకు పై బడిన వారు 31.2 శాతం వైరస్ నుంచి కోలుకున్నారని.... 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లలో 28.5 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయని తేలింది.
 
5 నుంచి 17 ఏళ్ల లోపు ఎక్కువగా వైరస్ బాదిన పడుతూ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు భారత్ లో ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మంగళవారం ప్రారంభం కానున్నాయి. పుణెకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలను నిర్వహించనుంది. వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనెకాతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: