ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడిపోతుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది.  ఈ క్రమంలోనే మొదటి దశ కరోనా వైరస్ తో ఎంతమంది పోరాటం చేసిన ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అని సంతోషపడుతూ ఉన్న తరుణంలో ఇక వైరస్ రూపాంతరం చెంది రెండవదశ కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది  మొదటిదశ తో పోల్చి చూస్తే మరింత ప్రభావవంతంగా ఈ వైరస్ ప్రభావం చూపించింది.  ఇలా వైరస్ రూపాంతరం చెందుతున్న తరుణంలో ప్రపంచ ప్రజానీకం ఆందోళనలో మునిగిపోతుంది.



 అయితే ఇప్పుడు వరకు ప్రపంచ దేశాలలో కేవలం రెండవదశ కరోనా వైరస్ మాత్రమే వ్యాప్తి చెందింది. ఒక్కో దేశంలో ఒక్కో రకం వైరస్ వ్యాప్తి చెందింది. ఇక రెండవ దశ కరోనా వైరస్ కూడా అన్ని దేశాలు పూర్తిస్థాయిలో వ్యాప్తి చెందలేదు. అయితే ప్రపంచాన్ని మొత్తం ప్రస్తుతం రెండవ దశ కరుణ వైరస్ అల్లకల్లోలం సృష్టించగా.. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుతుంది. అంతలోనే మరికొన్ని రోజుల్లో మూడవదశ వైరస్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక మహిళ శరీరంలో మాత్రం ఏకంగా 32 రకాల కరోనా వైరస్ లను గుర్తించారు వైద్యనిపుణులు.



 ఇది కాస్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. దక్షిణాఫ్రికాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ శరీరంలో కరోనా వైరస్ 216 రోజులపాటు జీవించి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతే  కాకుండా ఆ మహిళ శరీరంలో 32 రకాల కరోనా వైరస్ లు ఉన్నాయి అన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. అయితే ముందుగా సదరు మహిళకు హెచ్ఐవి ఎయిడ్స్ రావడం కారణంగా ఆమె శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా క్షీణించిందని.. అందుకే ఇలా వైరస్లు ఎక్కువ మొత్తంలో ఆమెపై దాడి చేసాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్,దక్షిణాఫ్రికా సహా మరికొన్ని దేశాలకు చెందిన వేరియంట్లు ఆ మహిళ శరీరంలో ఉన్నట్టు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: