దేశ స్వాత్రత్యం కోసం పది సంవత్సరాలు జైలు లో మగ్గిన జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం ఈ దేశ ప్రజలకు ఒక పండుగ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దేశ స్వాతత్య్రంలో ఎలాంటి పాత్ర లేని వారు.. బ్రిటిష్ వారితో కాదు, అంతర్గతంగా మతలాతో కోట్లాడాలని అన్నవారిని ఈరోజు దేశ భక్తులుగా చూపిస్తున్నారు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నేటి యువతకు తప్పుడు చరిత్ర ను చూపిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదు.. వాయిదా వేసాం అని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. కలెక్టర్ లు రాజకీయ అవతారం ఎత్తారని, టిఆర్ఎస్ ధర్నాలకు అనుమతులు ఎలా వస్తాయి..మా పార్టీ కి ఎంధుకు ఇవ్వరు అని ప్ర‌శ్నించారు.



నిబంధనలు మాకు మాత్రమేనా..టిఆర్ఎస్, బీజేపీ లకు ఉండవా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి వ్య‌తిరేకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముందు నిరసన తెలుపుతామ‌ని తెలిపారు. బీజేపీ, టిఆర్ఎస్ లు తొడుదొంగలు అని విమ‌ర్శించారు. వడ్ల కొనుగోలు విషయం లో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఒక పది వేల కోట్లు వడ్లు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా అని ప్ర‌శ్నించారు. ధర్నా కోసం కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదని ప్ర‌శ్నించారు. వడ్లు కొననందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఓటు వేయాలి అని విమ‌ర్శించారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రతీ ధాన్యం గింజ కొనాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో  కేసీఆర్ ఎంధుకు దీక్ష చేయడు అని నిల‌దీశారు.

 
వారసత్వం గా వచ్చిన ఆస్తులను కూడా  దేశ స్వాతంత్ర్యం కోసమే జవహర్ లాల్ నెహ్రూ వదులుకున్నారు అని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నెహ్రూ వేసిన పునాదు వ‌ల్లే ఈ దేశం ఇంత బలంగా నిర్మాణం అవ్వడానికి కారణం అని అన్నారు. ఈ దేశం ను ప్రేమించే ప్రతీ ఓక్కరు నెహ్రూ కు నివాళులు అర్పించాలి అని కోరారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ వ్యక్తి గత స్వార్థం కోసం దేశ స్వాతంత్ర్యంలో ఎలాంటి సంబంధం లేని వారిని స్వాతంత్ర్య ఉద్య‌మకారులుగా చెప్తున్నారు అని అలాంటి వారు  దేశ ద్రోహులు అని మండి ప‌డ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని దింపేయాల్సిన అవసరం ఉంది అన్నారు. హుజూరాబాద్ రివ్యూ చాలా అర్దవంతంగా జరిగిందని చెప్పారు. హుజూరాబాద్ సమీక్ష పై వచ్చిన ఏ వార్త కూడా నిజం కాద‌ని సమావేశం తర్వాత మేము చెప్పిందే వాస్తవం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: