జగన్మోహన్ రెడ్డి అంటే ఎల్లోమీడియాకు ఎంతమంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. ఉన్నది లేనట్లు, జరగనిది జరిగినట్లు చిత్రీకరించి పిచ్చికథనాలు అచ్చేస్తు తన కసిని తీర్చుకుంటోంది. తనరాతలవల్ల జగన్ కు ఎంతవరకు నష్టంజరుగుతుందో ఎవరు చెప్పలేరుకానీ ఎల్లోమీడియా మాత్రం బాగా తృప్తిపడుతోంది. జగన్ మీద బురదచల్లేయాలనే తొందరలో ఒక్కోసారి ప్రత్యర్ధుల మీదే బురద చల్లేస్తున్న విషయాన్ని ఎల్లోమీడియా గ్రహించటంలేదు. ఇందుకు తాజాగా రాసిన రాతలే ఉదాహరణగా నిలిచింది.





ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నంలో నరేంద్రమోడీ రెండురోజులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో అనుకున్నట్లు కాకుండా కొన్ని కార్యక్రమాల్లో మార్పులు జరిగాయి. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గిరిజన యూనివర్సిటికి మోడీ శంకుస్ధాపన చేయటంలేదు. మొదట్లో అనుకున్నా చివరినిముషంలో పై కార్యక్రమాలు రద్దయ్యాయి. చివరి నిముషంలో ఎందుకు రద్దయ్యిందంటే అందుకు బీజేపీ నేతలే కారణమట.





విషయం ఏమిటంటే శంకుస్ధాపన కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటే ఆ క్రెడిటంతా జగన్ ఖాతాలో పడుతుందని కమలనాదులు అనుకున్నారట. అందుకని చివరినిముషంలో జోక్యం చేసుకుని శంకుస్ధాపనలు రద్దుచేయించారని ఎల్లోమీడియా చెప్పింది. ఎల్లోమీడియా చెప్పింది ఎలాగుందంటే జగన్ కన్నా బీజేపీ నేతల మాటే మోడీ దగ్గర ఎక్కువగా చెల్లుబాటైందన్నట్లుగా ఉంది.  జగన్ను దెబ్బకొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్న ఎల్లోమీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా అచ్చేసింది. అయితే పై కార్యక్రమాలకు మోడీ శంకుస్ధాపన చేయకపోతే జరిగే నష్టం రాష్ట్రానికి, బీజేపీకే కానీ జగన్ కు కాదన్న విషయాన్ని ఎల్లోమీడియా మరచిపోయింది.





అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని జగన్ ప్రయత్నిస్తే బీజేపీ అడ్డుకుందన్న విషయాన్ని ఎల్లోమీడియా యావత్ రాష్ట్రానికి చాటిచెప్పింది. అసలే ఏపీ ప్రయోజనాలను మోడీ సర్కార్ తుంగలో తొక్కేస్తోందన్న మంట జనాల్లో విపరీతంగా ఉంది. ఎంతో కష్టపడి మోడీని శంకుస్ధాపనలకు జగన్ ఒప్పిస్తే చివరినిముషంలో బీజేపీ అడ్డుకున్నారన్న విషయాన్ని ఎల్లోమీడియా టముకేసి మరీ చెప్పింది. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ను బద్నాం చేయాలన్న ఉద్దేశ్యంతో రాసిన రాతలంతా బీజేపీని గబ్బుపట్టించిన విషయాన్ని బహుశా ఎల్లోమీడియా గుర్తించలేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: