'ఉచిత విద్యుత్' ఎత్తివేత పై వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పింది.. ఉచిత విద్యుత్ కి జగన్ చెక్ పెట్టేశారని తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో…అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రజలకు వివరించడానికి సలహాదారు కల్లాం అజేయరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. కేంద్రం వత్తిడి వల్లే వైఎస్ఆర్ చేపట్టిన ఈ పతాకాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ తప్పేం లేదని.. అంతా.. కేంద్రం తప్పేనని అన్నారు. రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.