ఈనెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎన్ని విమర్శలు వచ్చినా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఈ సందర్భంగా యా విమర్శలను తిప్పికొడతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.. కోవిడ్ నిబంధనల మధ్య ఈ సమావేశం జరపడానికి అన్ని సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రజోపయోగ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించమే కాకుండా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహం రచించినట్లు తెలిసింది. దీంతో ఎప్పుడు ఏకపక్షం గా సాగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిసారి ఎంతో ఉత్కంట భరితంగా సాగనున్నాయని అనిపిస్తుంది..