జేసీ దివాకర్ రెడ్డి గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉండడం రాజకీయ వర్గాలు ఆశ్చర్యంగా ఉంది.. టీడీపీ లో ఉంటూ చంద్రబాబు ను విమర్శించినా, ప్రతిపక్షంలో ఉంది జగన్ ని పొగిడినా అది ఆయనకే చెల్లింది.. కారణమేంటో తెలీదు కానీ తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని రవాణా శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ ల కేసులో అరెస్ట్ చేసినప్పటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి బయటకు రావడం లేదు. మరో నాలుగేల్లు నోర్మూసు కూర్చోవడమే బెటర్ అని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన వద్దని కుటుంబ సభ్యులను జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించినట్లు తెలిసింది.