కొత్త రెవిన్యూ చట్టం.. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా.. ఎలాంటి సవరణలు ప్రతిపాదించకుండానే ఈ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టంలో మార్పు ఎందుకు అవసరమో కేసీఆర్ చెప్పిన విధానం అందరికి నచ్చింది. ఆయన రేవెన్యూ చట్టంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగిస్తున్నామన్నారు. రెవెన్యూ సంస్కరణలో ఇది తొలి అడుగు మాత్రమేనని సభ్యులకు గుర్తు చేశారు.