చంద్రబాబు విశాఖ కు రాకుండా ఎదో ఒక చెప్తుండడం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారిపోయింది. కరోనా సమయంలోనూ అప్పుడప్పుడూ విజయవాడ వచ్చి వెళుతున్నారు. కానీ అదే సమయంలో ఆయన విశాఖ రావడం లేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ లో చర్చ జరుగుతోంది. రాష్రం లో పెద్ద ఎత్తున జరుగుతున్న అమరావతి ఉద్యమానికి రావడానికి చంద్రబాబు కి టైం ఉంటుంది కానీ విశాఖ పట్నం రావడానికి ఎందుకు సంశాయిస్తున్నాడో అర్థం కావట్లేదు అని టీడీపీ నేతలు వాపోతున్నారట..