అంతర్వేది రధం ఘటన మరవకముందే ఏపీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఉన్న మహా మండపం వద్ద అమ్మవారి రథానికి ఉన్న నాలుగు వెండి సింహాలలో మూడు చోరీకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. అయితే వరుసగా ఇలా దేవాలయాలపై దాడి జరగడం తో ఇందులో ఏమైనా కుట్ర ఉందా అన్న ధోరణిలో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, ఈవో సురేష్ బాబులు తమ వివరణ ఇచ్చినా దీనిపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.