విజయవాడ లో దుర్గ గుడి లో సింహాల మాయం విషయం ఇప్పుడు కొద్ది కొద్ది గా ముదురుతూ వస్తుంది. స్థానికంగా ఈ ఘటన కొంత కలకలం రేపగా ఈ సింహపు ప్రతిమల మాయం కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. ముందునుంచి అనుకున్నట్లు ఈ ప్రతిమలు చోరీ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.ఆలయ చైర్మన్ పోలీసులకు కేసు నమోదు చేయగా మొత్తం నాలుగు వెండి సింహం ప్రతిమలకు గానూ అందులో మూడు చోరీ అయినట్లుగా గుర్తించారు.