గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తి కనపడుతున్న ప్రజాప్రతినిధుల నేర చరిత్ర వ్యవహరం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను ఎరిపారేయాలన్న లక్ష్యం తో సుప్రీం కోర్టు వేసిన ఈ అడుగు మునుముందుకు సాగేందుకు సిద్ధం అవుతుంది.. అమికస్ క్యూరీ చురుగ్గా వ్యవహరించడంతో అన్ని రాష్ట్రాల హై కోర్టు ల నుంచి ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమికస్ క్యూరీ విజయ్ హన్సరియ సేకరించి సుప్రీం కోర్టు కు సమర్పించారు. దేశవ్యాప్తంగా దాదాపు 4859 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు, తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది.