మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటినుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలైంది. ముఖ్యంగా కార్య నిర్వాహక రాజధాని గా విశాఖ పట్టణాన్ని ప్రకటించడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురైన యా ప్రాంత వాసులకు ఓ రకమైన భరోసా కలుగుతోంది. తమ పరిస్థితి ఎలాగున్నా భవిష్యత్ తరాలు ఊహించని అభివృద్ధిని చూస్తారన్న నమ్మకం ప్రస్తుత పరిణామాలతో వారితో పెరుగుతోంది. ఆ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వాణిజ్య పరమైన అంశాల్లో కూడా విశాఖ వేగం పుంజుకుంది..