టీడీపీ కూడా మోడీ కి దగ్గరయ్యే ప్రయత్నాలు బాగానే చేస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా మోడీ పేరు తీసుకువచ్చి మోడీ పై తనకున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నాడు.. ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కి తిరుపతి ఎంపీ సీటు విషయంలో బీజేపీ కి పూర్తి మద్దతు ఇవ్వనున్నారట. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ సీటును బీజేపీకి ఉచితంగా ఆఫర్ చేశారట చంద్రబాబు. అంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉచితంగా మద్దతును ఇస్తారట. గెలవలేక కుంటి సాకులు అన్నట్లు టీడీపీ వేస్తున్న ఈ ప్లాన్ కి బీజేపీ ఏమైనా పడిపోతుందా అనే అనుమానాలు ప్రజల్లో ఇప్పుడు కలుగుతున్నాయి..