చంద్రబాబు గత ఎనిమిది నెలలుగా రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు అని చెప్పాలి. రాష్ట్రంలోని ఏ సమస్య ని అయన పట్టించుకోలేదు.. కనీసం బీజేపీ, జనసేన పార్టీ లు అయినా కొంత ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేశాయి కానీ టీడీపీ మాత్రం ఎక్కడి దొంగలు అక్కడనే అన్నట్లు వ్యవహరించింది.. అప్పుడప్పుడు వచ్చినా పెద్దగా ఉపయోగం లేని పనులే చేశారు.. ఇక చంద్రబాబు ను కలుద్దామనుకున్న తమ్ముళ్ళకి ఎక్కడా నిరాశ ఎదురైంది.. ఈ క్రమంలో ఇటీవలే ఆయన అమరావతి ప్రాంతానికి రావడంతో ఆయనను కలవొచ్చని క్యాడర్ ఆయన నివాసం వద్దకు చేరుకోగా.. వారికి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యే అవకాశం దక్కలేదు.