రాష్ర రాజకీయాలను చాల సంవత్సరాలు శాసించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు శాసింప బడే స్థాయికి దిగజారిపోయింది. నలభై ఏళ్ళు అనుభవం ఉన్నా కూడా జగన్ లాంటి ఓ కుర్రాడి చేతిలో చంద్రబాబు ఓడిపోవడం టీడీపీ వర్గం వారు జీర్ణించు కోలేకపోతున్నారు.. అందుకు తగ్గట్లే పార్టీ పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా ఉంది.. చాలా పెద్ద అసెంబ్లీ నియోజక వర్గాలున్న రాష్ట్రం గా దేశంలో నే పేరున్న ఏపీ లో కేవలం 23 మందిని గెల్చుకోవడం అంటే చాలా దిగజారిపోయిన పరిస్తితి.. అయితే ఇది వారి ని ఎంతగా దేబ్బకోట్టిందంటే భవిష్యత్ లో కోలుకోలేనంతగా కొట్టింది..