ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. లేని సమస్యలపై కూడా పోరాటాలు చేయాలని ఆదేశించేవారట. అధినేత చెప్పినట్లు చేయలేక.. పార్టీలో ఉండలేక చాలా మంది సతమతం అవుతున్నారు. వైసీపీకి మద్దతు తెలిపిన అనంతరం ఎమ్మెల్యేల మాటల్లో అది స్పష్టం అవుతుంది. దీంతో చంద్రబాబు తీరు నచ్చకే ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారన్న ప్రచారం జోరందుకుంది.