చంద్రబాబు రాజకీయ తంత్రం గురించి అందరికి తెలిసిందే.. ఉన్న చోటే ఉండి రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించగల వ్యక్తి చంద్రబాబు నాయుడు.. ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయి కొంత ఢీలా పడిపోయాడే గానీ తనదైన టైం లో రాజకీయాల్లో ఎంత చక్రం తిప్పగలిగాడో అంత చక్రం తిప్పేశాడు.. సీనియర్ నాయకులను సైతం మైమరిపించే వ్యూహాలు వేశాడు చంద్రబాబు.. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే తమ నేతలను కొంతమంది బీజేపీ లోకి పంపాడు చంద్రబాబు.. కొన్ని రాజకీయ ప్రయోజనాల మేర ఇబ్బందులు తలెత్తుతాయని ముందే ఊహించి వారిని బీజేపీ లోకి పంపి కొంత సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు..