రాష్ట్రాభివృద్ధి లో భాగంగా జగన్ మూడు రాజధానులను సృష్టించి అమరావతి ప్రజలకు ద్రోహం చేశాడని టీడీపీ వర్గాలు అమరావతి లో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు అవన్నీ ఒట్టి అపోహలు, టీడీపీ తమ రాజకీయ ఉనికిని చాటడానికి ఇలా అబద్ధపు ప్రచారకం చేస్తున్నారు అని చెప్తూ అమరావతి ప్రజలను అక్కున చేర్చుకునేది తమ ప్రభుత్వం అని చెప్తున్నారు.. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అక్కడి ప్రజలకు తమ తరపున భరోసా ఇచ్చేనందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది.. వాస్తవానికి అమరావతి లో పోరాటం చేసేది రైతులు కాదు టీడీపీ నుంచి లాభం పొందిన కొందరు భూబకాసురులు అని వైసీపీ వారు భావిస్తున్నారు..