అచ్చెన్న పదవిలోకి రాగానే వైసీపీ ని టార్గెట్ చేస్తూ చాలా వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యంగా స్థానిక ఎన్నికల అంశంలో టీడీపీ వైసీపీ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది..స్థానిక సంస్థల ఎన్నికలపై అచ్చెంనాయుడు తమలోని భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ భయపడుతోందంటూ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే వైసీపీ అడ్డుపడుతోందంటూ మాట్లాడారు. ప్రజా వ్యతిరేకత చూసే వైసీపీ వెనుకంజ వేస్తోందని అధికార పార్టీ నేత మాదిరిగా చెప్పుకొచ్చారు.ఆది నుంచి ఎన్నికలను అడ్డుకున్న టీడీపీ నేతలు.. ఇప్పుడు అధికార పార్టీ అడ్డుకుంటోందని విమర్శించడం విడ్డూరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.