కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు ఇందుకు అనుగుణంగా సన్నాహాలు చేస్తున్నారు.