ఈమధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద దర్శకులకంటే మీడియం రేంజ్ లో హిట్స్ కొట్టిన దర్శకులతో సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపెడుతున్నారు. అందుకు తగ్గట్లే అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవరు సినిమా చేశాడు మహేష్.. ఇప్పడూ పరశురామ్ తో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నాడు.. గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ కొట్టిన పరశురామ్. టాలీవుడ్ లో ఇంతవరకు రానటువంటి స్టోరీ తో పరశురామ్ ఈ సినిమా చేస్తున్నాడట. సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సుకుమార్ ని కాదని మరీ చేస్తున్న ఈ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని మహేష్ బాబు కూడా సినిమా పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట..