గత ఎన్నికల్లో టీడీపీ ఎంతటి పరాభవం పొందిందో అందరికి తెలిసిందే..నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి..కేవలం 23 సీట్లతో సరిపెట్టుకుని వైసీపీ పార్టీ చేతిలో దారుణంగా ఓటమి చెందింది.. ఇక ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అని చెప్పొచ్చు.. అధినేత చంద్రబాబు తప్పా అధికార పార్టీ ని విమర్శించే సాహసం ఎవరుచేయలేకపోయారు.. అప్పుడే అవినీతి పరులను ఏరిపారేస్తున్న జగన్ కి ఎక్కడ ఎదురెళ్తే తమకు అదే గతి పడుతుందేమోనన్న భయం టీడీపీ నేతల్లో నెలకొనగా అమరావతి, అంతర్వేది వంటి విషయాల్లో జగన్ బ్యాడ్ చేయడానికి చాలా ప్రయత్నించింది.