దుబ్బాక ఎన్నికలు ముగిసిపోయాక అన్ని పార్టీ లు తమదంటే తమదే గెలుపు అంటూ ప్రచారం చేసుకున్నాయి.. అయితే గెలుపు ఎవరిదో తెలీకముందే దుబ్బాక లో తమ జెండా ఎగరబోతుందంటూ వారు చేసుకుంటున్న ప్రచారం కొంత ఎక్కవే ఆయినా అధికార పార్టీ కి మాత్రం ఇక్కడ కొంచెం డౌట్ మొదటినుంచి ఉంది. అందుకు కారణం బీజేపీ పార్టీ అతి దూకుడే.. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ లో బీజేపీ పార్టీ ఇప్పుడు గట్టిగానే బలపడింది.. నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో కాంగ్రెస్ ని కొట్టి నేడో రేపో అధికార పార్టీ ని కూడా తొక్కేయాలని చూస్తుంది.. అందుకు వేదికగా దుబ్బాక ను చేసుకుని ఇక్కడా ఎలాగైనా గెలవాలని పక్కా ప్లాన్ చేసింది..