నెల్లూరు జిల్లా బోగోలు మండలం ఏనుగుల బావి గ్రామమునకు దొంగతనం చేయుటకు వెళ్లారు దుండగులు. అక్కడ ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గమనించి అశోక్, గౌస్ బాషా ఇంటి తాళం పగులగొట్టి ఇంటి లోనికి ప్రవేశించారు.ఇంట్లో నుండి రూ.66000 నగదు దొంగతనం చేసుకొని వెళ్తున్న సమయంలో, సదరు గ్రామస్తులు అతన్ని చూసి వెంబడించారు.