టీఆర్ఎస్ ఓసీలను పూర్తిగా విస్మరించినందు వల్లే గ్రేటర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదల కోసం విద్య, ఉద్యోగ రంగాలలో ప్రకటించిన పది శాతం ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయకుండా విస్మరించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.