ప్రపంచంలో చాల రకాల పండ్లు దొరుకుతాయి. అయితే వాటిలో క్రాన్బెర్రీస్ చాల ప్రత్యేకత ఉంది. ఈ క్రాన్బెర్రీస్ అనేవి చిన్నగా, గుండ్రంగా, ఎరుపు రంగులో ఉండే పండ్లు. కొద్దిగా పుల్లగా, కొద్దిగా వగరుగా ఉండే ఈ పండ్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. క్రాన్బెర్రీ మొక్కలు సంవత్సరాల తరబడి బతికే ఉంటాయి. దాదాపు 65 ఏళ్ల దాకా జీవిస్తాయి.