మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అనేక రికార్డులను కైవసం చేసుకున్నాడు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ కలిగన నేతగా మోదీ రికార్డుల కెక్కారు. ఓ అమెరికా సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయింది. ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతల్లో ఎవరెవరు అత్యంత ప్రజాధరణ కలిగిన నేతలు.. అన్న విషయమై ఆ సంస్థ పరిశోధన చేసింది.