తాజాగా ఓ వ్యక్తి తుమ్మును ఆపుకోవాలని ప్రయత్నించాడు. కానీ చివరకు అతడు ఆసుపత్రిలో చేరాడు. తుమ్ము వస్తున్న సమయంలో దానిని ఆపడానికి అతడు ప్రయత్నించాడు. చేతులతో నోరు, ముక్కును మూసుకున్నాడు. దాంతో అతని మెడ ఎముకలు విరిగిపోయాయి. ఈ షాకింగ్ ఘటన పోర్చుగల్ లో జరిగింది.