ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు అథెంటికేషన్ కూడా సులువు అవుతోంది. అంటే ఎక్కడైనా మీ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించినప్పుడు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందన్నమాట. అయితే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చాం అన్న సంగతి చాలామందికి గుర్తుండదు.