నిమ్మగడ్డి గురించి చాల తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇది గడ్డి మొక్క అయినా నిమ్మగడ్డి బహువిధాలుగా ప్రయోజనాలు కలిగినది . దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. నిమ్మగడ్డిని వంటకాలకు, పరిమళాల తయారీ, సౌందర్య చికిత్సలు లాంటి వాటికి వాడతారు. దీంట్లో ఆరోగ్యకరమన పోషకాలతో పాటు సువాసన వెదజల్లే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.