
మెదక్ …. జగదేవ్ పూర్ మండలం.. ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్ లో డిసెంబర్ 23 బుధవారం ప్రారంభమైన ఈ మహా యాగం.. ఈ నెల డిసెంబర్ 27 ఆదివారం వరకూ కొనసాగుతుంది. శృంగేరీ జగద్గురువులు భారతీ తీర్ధ మహా స్వామి ఆశీస్సులతో అయిదు రోజుల పాటు ఈ యాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ యాగంలో పాల్గొనేందుకు… 7 రాష్ట్రాల నుంచి 1500 మంది రుత్వికులు హాజరవుతున్నారు. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ప్రజా ప్రతినిధులు ఇలా దేశవిదేశాల నుంచి.. మొత్తం 40 వేల మంది…ఈ యాగంలో పాల్గొంటున్నారు.
40 ఎకరాల విస్తర్ణంలో ప్రారంభమైన ఈ యాగంలో.. 110 హోమ గుండాలతో పాటు చతుర్వేద యాగ శాలలు కూడా ఏర్పాటు చేశారు. 1500 మంది రుత్వికుల్లో 1100 మంది ఏక కంఠంతో ఐదు రోజుల పాటు 10 వేల సప్తశతి పారాయణాలు, చండీ నవాక్షరి జపాలు చేస్తారు. వీరు చాలా కఠిన నియమాలు పాటిస్తారు. అందుకు సరిపడా హోమ కుటీరాలు, గుండాలు ఇక్కడ నిర్మించారు. ఈ అయుత చండీ మహాయాగం మొదటి రోజు…అంటే…బుధవారం ముందుగా గురు ప్రార్థన, గణపతి పూజలు నిర్వహిస్తారు. దాంతో పాటు గోపూజ, మహా మంటప స్థాపన ఉన్నాయి. అదేవిధంగా చండీ యంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ట, దేవతా ఆవాహనం, ప్రాణ ప్రతిష్ట, నవావరణార్చన, సహస్రచండీ పారాయణం, పంచబలి, యోగినీబలి, మహారుద్రయాగ సంకల్పం, మహా మంగళ హారతితో ఉదయం పూట యాగాన్ని పూర్తి చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ధార్మిక ప్రవచనం, సాయంకాలం కోటి నవాక్షరీ పురశ్చరణం, విశేష పూజ అశ్వేష బలి, రాత్రి శ్రీరామలీల హరికథతో మొదటి రోజు యాగం పూర్తవుతుంది.రెండవ రోజు కూడా గురుప్రార్ధన, గోపూజతో ప్రారంభమవుతోంది… యాగం. సహస్రచండీ పారాయణం, మహారుద్ర సంకల్పంతో ఉదయం పూట యాగం పూర్తవుతుంది. మధ్యాహ్నం ధార్మిక ప్రవచనంతో మొదలై రాత్రి మరో హరికథతో ముగిస్తుంది. అదేవిధంగా 25,26 తేధీల్లో కూడా ఈ యాగం ఇదే పద్దతిలో కొనసాగుతుంది. 27వ తేదీ యాగం చివరి రోజున గురుప్రార్థన, పుణ్యాహవచనం, కుండ సంస్కారం, ప్రధాన కుండంలో అగ్ని ప్రతిష్ట, సపరివార అయుత చండీయాగం ఉంటాయి. యాగం చివరి రోజున ఒక్కో హోమగుండం దగ్గర 11 మంది రుత్వికులు పాయసంతో హోమం చేస్తారు. అదేవిధంగా రుత్విక్ సన్మానం, మహా మంగళ హారతి, ప్రసాద వితరణం, యాగ సంపూర్ణం తో మహా యాగం పూర్తవుతుంది. 100 మంది బ్రాహ్మణులు… పాలతో 10 వేల పారాయణాలకు దశాంశంగా వెయ్యిసార్లు తర్పణలిస్తారు. చివరగా మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు.(source}